భారీ అంచనాల నడుమ విడుదలైన ‘లింగ’ సినిమా అనుకున్న అంచనాలను అందుకోలేక బాక్స్ ఆఫీసు వద్ద ఫ్లాప్ గా నిలిచి రజినీకాంత్ అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. ఆ తర్వాత బాగా గ్యాప్ తీసుకున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ఈ సారి కచ్చితంగా హిట్ కొట్టాలని యంగ్ డైరెక్టర్ అయిన పిఎ రంజిత్ డైరెక్షన్ లో ఓ డిఫరెంట్ సినిమా చెయ్యడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి మొదలు కానుంది. కానీ రజినీ ఈ సినిమాలో తన లుక్ కి సంబందించిన ఫోటో షూట్ తో ఈ సినిమా షూట్ ని మొదలు పెట్టారు. ప్రస్తుతం రజినీకాంత్ పై కొన్ని లుక్స్ ని ట్రై చేస్తున్నారు.
వీటిలో ఏది బాగుంటే ఆ లుక్ ని ఫైనలైజ్ చేస్తారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ 18 నుంచి మొదలు కానుంది. ఆ రోజు ఈ ఫోటో షూట్ నుంచి ఫైనలైజ్ అయిన స్టిల్స్ ని ఫస్ట్ లుక్ పోస్టర్స్ గా రిలీజ్ చేయనున్నారు. రజినీకాంత్ ఈ సినిమాలో కబాలీశ్వరస్ అనే పాత్రలో కనిపించనున్నాడు. ఈ పాత్ర సౌత్ చెన్నైలోని ఓ రియల్ లైఫ్ మాఫియా దాన నుంచి స్పూర్తిగా తీసుకొని చేస్తున్నారు. అందుకే ఈ సినిమాకి తమిళ్లో ‘కబాలి’ అనే టైటిల్ ని ఫైనలైజ్ చేసారు. రజినీకాంత్ సరసన రాధిక ఆప్టేని హీరోయిన్ గా ఫైనలైజ్ చేసిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, జెడి చక్రవర్తి ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.


