పొలిటికల్ ఎంట్రీ గురించి మాట్లాడిన రజనీకాంత్ !


సూపర్ స్టార్ రాజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఎన్నాళ్లగానో ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. పలు రాజకీయ పార్టీలు కూడా రజనీకాంత్ ను పార్టీల్లోకి ఆహ్వానించాయి కూడా. కానీ రజనీ మాత్రం ఎప్పటికప్పుడు ఆ అంశాన్ని తోసిపుచ్చుతూ వచ్చారు. కానీ ఈరోజు ఆయన అభిమానుల సమావేశంలో మాట్లాడిన మాటలు వింటే మాత్రం రాజకీయాల పట్ల ఆయన కోణం కాస్త మారినట్టు కనిపిస్తోంది.

మొదట మద్యానికి అలవాటుపడొద్దని అభిమానులకు చెప్పిన రజనీ ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం అనేది దేవుడి చేతుల్లో ఉందని, తానెప్పుడూ నిజాయితీగానే పనిచేస్తానని అన్నారు. అలాగే ప్రస్తుతం కొందరు రాజకీయ నాయకులు రాజకీయాలను సంపాదన కోసమే ఉపయోగిస్తున్నారని, ఒకవేళ తాను రాజకీయాల్లోకి వస్తే అలాంటి వారి కోసం పని చేయనని, 21 ఏళ్ల క్రితం డిఎంకె పార్టీకి సపోర్ట్ చేయడమనేది అనుకోకుండా జరిగిందని అన్నారు.

ఈ మాటలను బట్టి రజనీకాంత్ రాజకీయాల పట్ల కాస్త సుముఖంగానే ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఆయన ముందు ముందు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియలాంటే కాస్త వేచి చూడాలి.