ఒకే వేదికపై రజినీకాంత్, అమితాబ్, కమల్, చిరంజీవి..!

ఒకే వేదికపై రజినీకాంత్, అమితాబ్, కమల్, చిరంజీవి..!

Published on Oct 28, 2014 8:36 PM IST

mega-stars
ఒకే వేదికపై భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అగ్ర హీరోలను ఒకే వేదికపై చూసే అరుదైన అదృష్టం త్వరలో ప్రేక్షకులకు కలగనుంది. ఈ అద్బుత దృశ్యం ఆవిష్కృతమయ్యె ఘట్టానికి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం వేదికను సిద్దం చేస్తుంది. నవంబర్ 29న బెంగుళూరులో కంఠీరవ, స్వర్గీయ రాజ్ కుమార్ మెమోరియల్ ప్రారంభోత్సవం నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ ప్రాంగణానికి ‘రాజ్ కుమార్ పుణ్యభూమి’ అని నామకరణం చేశారు. ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ చేయడం కోసం ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలను ఆహ్వానిస్తున్నారు.

ఆహ్వానితుల జాబితాలో రజినీకాంత్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, మమ్ముట్టీ, మోహన్ లాల్, చిరంజీవి తదితరులు ఉన్నారు. వీరందరూ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు