తలైవా సినిమాకు చిరంజీవి టైటిల్ వాడుకోబోతున్నారా?

Published on Jul 15, 2021 12:46 am IST

సూపర్ స్టార్ తలైవర్ రజినీకాంత్ ప్రస్తుతం శివ దర్శకత్వంలో “అన్నాత్తే” సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై రజినీ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఎన్నో వాయిదాలు పడుతూ వస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ క్రేజీ టాక్ బయటకొచ్చింది. ఈ సినిమాకు తెలుగులో చిరంజీవి సూప‌ర్‌హిట్ సినిమా టైటిల్ పెట్టాల‌ని చూస్తున్నారట.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా ముత్యాల సుబ్బ‌య్య ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ‘అన్న‌య్య’ సినిమా అప్పట్లో మంచి హిట్ అయిన సంగతి తెలిసిందే. “అన్నాత్తే” అంటే అన్నయ్య అని అర్ధం కావడంతో ఈ టైటిల్‌ను ఇప్పుడు ర‌జినీ సినిమా కోసం ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆలోచిస్తున్నారట. అయితే తెలుగులో ఈ టైటిల్ అయితే రజినీకాంత్ ఇమేజ్‌కి తగ్గుట్టుగా ఉంటుందని అనుకుంటున్నారట. మరీ ఇది ఎంతవరకు నిజమనేది ఇంకా తెలియాల్సి ఉంది. కాగా ఈ సినిమాలో జ‌గ‌ప‌తిబాబు, కుష్బూ, న‌య‌న‌తార‌, కీర్తి సురేశ్‌, మీనా వంటి స్టార్స్ న‌టిస్తున్నారు.

సంబంధిత సమాచారం :