అలాంటి సినిమాలకు రజినీ దూరం..?

అలాంటి సినిమాలకు రజినీ దూరం..?

Published on Oct 26, 2025 8:03 AM IST

rajinikanth

రజినీకాంత్ లాస్ట్ మూవీ ‘కూలీ’కి సెన్సార్ బోర్డ్ A సర్టిఫికెట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమాను థియేటర్లలో అందరికీ రీచ్ కాలేదని కోలీవుడ్ వర్గాల్లో ఓ టాక్. సినిమా రిలీజ్ అయిన తొలిరోజుల్లో బలమైన కలెక్షన్స్‌ వచ్చినా ప్రేక్షకులను పూర్తిగా అలరించలేదు. ఇక కూలీ ఎఫెక్ట్‌తో ఇప్పుడు రజినీకాంత్ ఓ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

రజినీకాంత్ ప్రస్తుతం ‘జైలర్-2’ సినిమాలో నటిస్తున్నాడు. ఇదిలా ఉండగా దర్శకుడు సుందర్ సి ఆయనకు కొన్ని కథలకు సంబంధించి చర్చ జరిపారట. రజినీ ఇకపై తన సినిమాల్లో A రేటెడ్ అంశాలు లేకుండా జాగ్రత్త పడుతున్నాడట. అందుకే ఫ్యామిలీ ఫ్రెండ్లీ, యాక్షన్-ఎలిమెంట్స్ ఉన్న సినిమాలపై ఆయన దృష్టి పెట్టారని టాక్.

మరి రజినీకాంత్ ఎలాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు