అది సూపర్ స్టార్ ఒక్కడికే సాధ్యం ఏమో !

అది సూపర్ స్టార్ ఒక్కడికే సాధ్యం ఏమో !

Published on Dec 12, 2018 3:20 PM IST

ప్రపంచవ్యాప్తంగా అభిమానులను కలిగి ఉన్న ఇండియన్ హీరోల్లో సూపర్ స్టార్ రజినీకాంత్ పేరు మొదటివరుసలో ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదనే చెప్పాలి. నిజానికి ఒక్క 2.ఓ మినహా గత కొని సినిమాలుగా రజినీ సినిమాలు ఆయన స్టార్ డమ్ కు తగట్లు ఆడకపోయినా, రజినీకాంత్ ఫాలోయింగ్ మాత్రం రోజురోజుకి పెరుగుతూనే వస్తోంది. రజనీ సినిమా వస్తోందంటే చాలు.. ఇక ఆ సినిమా హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధిస్తోంది.

కాగా ఈ రోజు సూపర్ స్టార్ పుట్టినరోజనే విషయం తెలిసిందే. ఈ సందర్బంగా తమిళనాడు వ్యాప్తంగా ఉన్న రజనీ అభిమానులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు సేవా కార్యక్రమాల్ని భారీ ఎత్తులో నిర్వహిస్తోన్నారు. కానీ సూపర్ స్టార్ మాత్రం ఎలాంటి హడావుడి చెయ్యకుండా ఎప్పటిలాగే వ్యక్తిగత వేడుకల అట్టహాసానికి రజని దూరంగా ఉన్నారు. అంతటి సూపర్ స్టార్ అయి ఉండి కూడా, ఇంత సింపుల్ గా ఉండటం ఒక్క రజినికే సాధ్యం ఏమో.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు