అప్పటివరకు సినిమాలు చేస్తాను.. రజనీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Published on Nov 8, 2019 4:28 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలు చేస్తూనే రాజకీయ వ్యవహారాల్ని కూడా ఒక కంట కనిపెట్టే ఉంటున్నారు. గత కొన్నాళ్లుగా రజనీ తన తర్వాతి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో కలిసి పోటీ చేస్తారనే వార్తలు వెలువడుతున్నాయి. ఈమధ్య రజనీ భాజాపాకు చెందిన ముఖ్య నేతతో సమావేశం కావడం ఈ వార్తలకి మరింత బలాన్నిచ్చింది.

ఈరోజ ఈ వార్తలను మీడియా రజనీ వద్ద ప్రస్తావించగా స్పందించిన ఆయన భాజాపా తనకు ఎలాంటి పదవీ ఆఫర్ చేయలేదని అంటూనే తనకు కాషాయ రంగును అద్దాలనే ప్రయత్నాలు చేస్తోందని, గతంలో ప్రముఖ తమిళ కవి తిరువళ్లువర్ విషయంలో కూడా భాజాపా ఇలానే చేసిందని, కానీ అది సాధ్యంకాలేదని, తాను కూడా వారి ట్రాప్లో పడనని అన్నారు. దీంతో ఇన్నాళ్ళుగా భాజాపాతో రజనీ కలుస్తారనే వార్తలకు చెక్ పడింది.

అంతేకాదు అధికారికంగా రాజకీయాల్లోకి వెచ్చే వరకు సినిమాలు చేస్తూనే ఉంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. రజనీ మాటలతో ఆయన అభిమానులకు అనేక విషయాలపై స్పష్టత వచ్చినట్టైంది. ఇకపోతే ఈయన నటించిన కొత్త చిత్రం ‘దర్బార్’ వచ్చే యేడాది జనవరిలో విడుదలకానుంది. ఇది కాకుండా ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఒక సినిమాను మొదలుపెట్టే పనిలో ఉన్నారు రజనీ.

సంబంధిత సమాచారం :

X
More