పాఠ్య పుస్తకాల్లో రజనీకాంత్ కథ !

పాఠ్య పుస్తకాల్లో రజనీకాంత్ కథ !

Published on Jun 9, 2019 5:45 PM IST

సూపర్ స్టార్ రజనీకాంత్ అంటే కేవలం సినిమాల్లో ఆయన నటన, క్రేజ్ మాత్రమే కాదు.. ఆయనలోని సింప్లిసిటీ, హార్డ్ వర్క్ కూడా. దేశంలోని అగ్రతారల్లో ఒకరిగా వెలుగొందుతున్న ఈయన చాలా తక్కువ స్థాయి నుండి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అలా చేరుకోవడం వెనుక ఆయన కృషి చాలా ఉంది. ఆ కృషి ఎంతో మందికి స్ఫూర్తిదాయకం. అందుకే రజనీ జీవితాన్ని పాఠ్య పుస్తకంలో చేర్చాలనే డిమాండ్ చాలా రోజుల నుండి తమిళనాడులో వినిపిస్తోంది.

ఆ డిమాండ్ ఇన్నాళ్లకు నెరవేరింది. ఐదవ తరగతి పాఠ్య పుస్తకంలో ఉండే స్వయంకృషితో ఎదిగిన ప్రముఖుల జీవిత చరిత్ర అనే పాఠంలో ఛార్లీ చాప్లిన్, స్టీవ్ జాబ్స్ వంటి ప్రముఖులు జాబితాలో రజనీకాంత్ జీవిత విశేషాల్ని కూడా పొందుపర్చారు. ఈ పాఠం ద్వారా రజనీకాంత్ మొదట్లో కార్పెంటర్‌గా పనిచేసేవారిని.. ఆ తర్వాతే బస్ కండెక్టర్ అయ్యారని, అక్కణ్ణుంచి నటుడిగా మారారనే చాలామందికి తెలియని కొత్త విషయం బయటపడింది. ప్రస్తుతం రజనీ మురుగదాస్ దర్శకత్వంలో ‘దర్బార్’ అనే సినిమా చేస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు