రజినీ కాంత్ నెక్స్ట్ మూవీ కూతురుతోనా?

Published on Jul 8, 2021 1:58 am IST

సూపర్ స్టార్ రజినీ కాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది దీపావ‌ళి కానుకగా నవంబ‌ర్ 4న ఈ సినిమా విడుదల కానుంది. అయితే ప్ర‌స్తుతం వైద్య ప‌రీక్ష‌ల కోసం అమెరికాకు వెళ్లిన ర‌జినీకాంత్ తన తదుపరి సినిమా ఎవరితో చేయబోతున్నారన్నది ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. ర‌జినీకాంత్ తదుపరి సినిమా కోసం ఇప్ప‌టికే చాలా మంది డైరెక్ట‌ర్లు క‌థ‌లు వినిపించార‌ట‌.

అయితే ర‌జినీకాంత్ కోసం ఆయన కూతురు సౌందర్య కూడా ఓ స్క్రిప్ట్ రెడీ చేసినట్టు సమాచారం. అయితే త‌లైవా త‌న త‌ర్వాతి సినిమాను కూతురు డైరెక్ష‌న్‌లోనే చేసేందుకే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నార‌ని అంతా అనుకుంటున్నారు. అంతేకాదు చివరిగా కూతురు డైరెక్షన్‌లోనే సినిమా చేసి ఇక విశ్రాంతి తీసుకోవాలని రజినీ భావిస్తున్నట్టు సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. అయితే రజినీ అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వె లువడే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :