ముచ్చటగా మూడోసారి రజినీ – శంకర్ ల కాంబినేషన్?

Rajinikanth-Shankar-Third-F
సంచలనాలకి కేంద్రబిందువుగా నిలిచిన శంకర్ – రజినీల కాంబినేషన్ లో శివాజీ, రోబో వంటి బ్లాక్ బస్టర్ లు వచ్చిన విషయం తెలిసినదే. తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరూ మరోసారి కలిసి పనిచేయబోతున్నారట.

ఈ ఆదివారమే ఈ కాంబినేషన్‌లో సినిమా అనౌన్స్‌ అవుతుంది. ఫిబ్రవరి 14న ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ చేస్తారన్న వార్తలు తమిళ నాట అప్పుడే మార్మోగిపోతున్నాయి. ఇటీవలే వీరిద్దరి నుండి వచ్చిన గత రెండు సినిమాలు అంత ఆశాజనక ఫలితాలు ఇవ్వని నేపధ్యంలో ఈసారి గట్టిగా కొట్టాలని కసిగా ఉన్నారట. రజిని గత చిత్రాలు కొచ్చాడియాన్, లింగ.. శంకర్ నంబన్, ఐ అంచనాలను అందుకోలేకపోయాయి.

ఇండియాలోని స్టార్‌ టెక్నీషియన్స్‌ వర్క్‌ చేసే ఈ చిత్రంలో హీరోయిన్‌ బాలీవుడ్‌ భామ నటిస్తుందని సమాచారం.

Exit mobile version