సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో స్టెప్స్ వేస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ‘లింగ’ సినిమాలో ఓ పాట కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ స్పెషల్ సెట్ ని వేసారు. అందులో రజినీకాంత్ – సోనాక్షి సిన్హాలపై ఈ పాటని చిత్రీకరిస్తున్నారు. ఈ సాంగ్ సెట్ ని ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సబు సైరిల్ డిజైన్ చేసారు.
కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రజినీ సరసన సోనాక్షి సిన్హాతో పాటు అనుష్క కూడా హీరోయిన్ గా నటించింది. రజినీ కాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్న ఈ మూవీని రాక్ లైన్ వెంకటేష్ నిర్మిస్తున్నారు. ఎఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్. ‘లింగ’ సినిమా ఆడియోని నవంబర్ లో రిలీజ్ చేసి సినిమాని రజినీ బర్త్ డే కానుకగా డిసెంబర్ 12న రిలీజ్ కానుంది.


