మోదీ తర్వాత ఆ సాహసం చేస్తున్నది రజనీయే

Published on Jan 28, 2020 9:50 pm IST

డిస్కవరీ ఛానల్ నందు ప్రసారమయ్యే ‘మ్యాన్ వెర్సెస్ వైల్డ్’ షో ప్రపంచవ్యాప్తంగా చాలా పాపులర్. ఈ షోకు ఫేమస్ సర్వైవల్ నిపుణుడు బేర్ గ్రిల్స్ హోస్ట్. ప్రకృతిలోని ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొని బ్రతకడం ఈ షో కాన్సెప్ట్. ఈ షో యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ ఇండియాలోని కర్ణాటకలోని బండిపురా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ నందు జరగనుంది. ఈ షోలో బేర్ గ్రిల్స్ తో పాటు సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా పాల్గొననున్నారు.

ఈ షో కోసం ఇప్పటికే రజనీ కర్ణాటక వెళ్లారు. ప్రస్తుతం షో కోసం షూటింగ్ చేస్తున్నారు. సో.. ఇన్నాళ్ళు సినీ హీరోగా రీల్ సాహసాలు చేసిన రజనీ ఈసారి నిజంగానే రియల్ సాహసాలు చేయనున్నారన్నమాట. బేర్ గ్రిల్స్ గత యేడాది భారత ప్రధాని మోదీతో జిమ్ కార్బెట్ నేషనల్ పార్కులో సాహస యాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆయన తర్వాత బేర్ గ్రిల్స్ తో పాటు షో చేస్తున్న ఇండియన్ సెలబ్రిటీ రజనీయే కావడం విశేషం.

సంబంధిత సమాచారం :

X
More