రజినీ చేతుల మీద అఖిల్ తమిళ్ లాంచ్.?

రజినీ చేతుల మీద అఖిల్ తమిళ్ లాంచ్.?

Published on Sep 28, 2015 6:25 PM IST

akhil
అక్కినేని ఫ్యామిలీ నుంచి మూడవతరం వారసుడుగా దూసుకువస్తూ ఇప్పటికే స్టార్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్న యంగ్ హీరో అఖిల్ అక్కినేని. అఖిల్ నటించిన మొదటి సినిమా ‘అఖిల్’. షూటింగ్ తో పాటు ఆడియో లాంచ్ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమాని అక్టోబర్ 22న రిలీజ్ చేయనున్నారు. దాంతో అఖిల్ ప్రస్తుతం యుఎస్ లో ప్రీ రిలీజ్ ప్రమోషనల్ టూర్ లో పాల్గొంటూ సినిమాని ప్రమోట్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అది పక్కన పెడితే అఖిల్ సినిమాని ఒకేసారి తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

దానికోసం ఎవ్వరూ ఊహించని విధంగా ప్లాన్ చేస్తున్నారు. అదేమిటంటే.. అఖిల్ సినిమా ఫస్ట్ టీజర్ ని బాలీవుడ్ కింగ్ ఖాన్ సల్మాన్ ఖాన్ చేతుల మీదుగా లాంచ్ చేయించి, అఖిల్ కి నేషనల్ వైడ్ గుర్తింపు తెచ్చి పెట్టారు. అలాగే తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఆడియో లాంచ్ లో అఖిల్ ని లాంచ్ చేసారు. ఇప్పుడేమో తమిళం మీద దృష్టి పెట్టడమే కాకుండా తమిళనాడు మొత్తం భీభత్సమైన క్రేజ్ ఉన్న తలైవా రజినీకాంత్ చేతుల మీదుగా లాంచ్ చెయ్యడానికి సిద్దమయ్యారు. ప్రసతుతం కోలీవుడ్ వర్గాలు చెబుతున్న సమాచారం ప్రకారం.. సి. కళ్యాణ్ అక్టోబర్ లో అఖిల్ ని తమిళ్ లో లాంచ్ చేయడం కోసం ఓ భారీ లాంచ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ లాంచ్ కోసం రజినీకాంత్ ని ఇన్వైట్ చేసారు, ఆయన ఇంకా ఫైనల్ కమిట్ మెంట్ ఇవ్వలేదు.

కానీ త్వరలోనే రజినీకాంత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తాడని అంటున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్వారా సయేషా సైగల్ కూడా హీరోయిన్ గా పరిచయం కానుంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు