రజినీకాంత్ రిటైర్మెంట్ మీద మళ్లీ చర్చ

Published on May 27, 2021 11:30 pm IST

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ రిటైర్మెంట్ మీద ఇప్పటికే పలుమార్లు చర్చ జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా కూడ ఇదే అంశం మీద సోషల్ మీడియాలో మరోసారి చర్చకు వచ్చింది. రజినీ త్వరలో రిటైర్ కాబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం సూపర్ స్టార్ ‘అన్నాత్తే’ చిత్రం చేస్తున్నారు. శివ ఈ సినిమాకు దర్శకుడు. లాక్ డౌన్ మూలంగా చిత్రీకరణకు బ్రేక్ పడింది. నిబంధనలు తొలగగానే మళ్లీ రీస్టార్ట్ అవుతుంది. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ ఏ సినిమా చేస్తారు అనేది ఇంకా క్లారిటీ రాలేదు. చాలామంది దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేసుకుని ఎదురుచూస్తున్నారు.

అయితే సూపర్ స్టార్ ఇంకో రెండు మూడు సినిమాలు మాత్రమే చేస్తారని అది కూడ ఆరోగ్యం సహకరిస్తేనే అని అంటున్నారు. ఈ విషయాన్ని సూపర్ స్టార్ స్వయంగా చెప్పినట్టు చెబుతున్నారు. ‘అన్నాత్తే’ సెట్లో చిత్ర బృందంలోని సభ్యులతో రజినీ ఈ మాటలు అన్నారని వినికిడి. రజినీ హెల్త్ కండిషన్ ఎలా ఉందో అందరికీ తెలుసు. చాలా సున్నితంగా ఉన్నారాయన. ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కొన్ని పనులను పక్కనపెట్టారాయన. ఇప్పుడు సినిమాలు కూడ ఇంకో రెండు మూడు మాత్రమే చేస్తారని వార్తలు వినిపిస్తుంటే అభిమానులు కాస్త అప్సెట్ అవుతున్నా రజినీ ఆరోగ్యం దృష్ట్యా ఆ నిర్ణయం కూడ సబబే అంటున్నారు.

సంబంధిత సమాచారం :