ఈ నెల 12న సూపర్‌ స్టార్‌ ఫ్యాన్స్ కు పండుగే !

Published on Jul 11, 2021 2:01 am IST

సూపర్‌ స్టార్‌ రజినీకాంత్ ఫ్యాన్స్ కు ఈ నెల 12వ తేదీ పెద్ద పండుగే. ఎందుకంటే.. ఆ రోజున రజిని తన అభిమానులను కలవబోతున్నాడు. ఈ మేరకు తన అభిమాన సంఘానికి చెందిన అన్ని జిల్లాల నాయకులకు రజినీకాంత్ ఆహ్వానం పంపించడంతో రజిని ఫ్యాన్స్ లో కొత్తగా సంతోషాలు ఉత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇంతకీ తన అభిమాన సంఘ నేతలను రజిని కలవడానికి గల కారణం, తన ఆరోగ్యం పై వచ్చిన రూమర్లేనట.

వైద్య ప‌రీక్ష‌ల కోసం జూన్ 19న అమెరికా వెళ్లిన సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ శుక్రవారం చెన్నైకి చేరుకున్నారు. అమెరికాలో పరీక్షలు అన్ని చేశాక, రజినీకి ఎలాంటి సమస్యలు లేవని అక్కడి వైద్యులు నిర్ధారించారు. దాంతో సూపర్ స్టార్ తిరిగి చెన్నై చేరుకున్నారు. ఇదే విషయాన్ని అభిమానులను కలిసి చెప్పాలని రజిని భావించారని, అందుకే అందర్నీ ఇలా ఆహ్వానిస్తున్నాడని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం :