రజనీ 169వ సినిమా కూడా సెట్టైపోయిందా ?

రజనీ 169వ సినిమా కూడా సెట్టైపోయిందా ?

Published on Nov 26, 2019 10:06 AM IST

Rajinikanth1

సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల విషయంలో స్పీడ్ పెంచారు. మురుగదాస్ డైరెక్షన్లో ‘దర్బార్’ చిత్రాన్ని చాలా వేగంగా కంప్లీట్ చేసిన ఆయన ఏమాత్రం ఆలస్యం లేకుండా శివ దర్శకత్వంలో కొత్త చిత్రానికి సైన్ చేశారు. ఈ డిసెంబర్లో ఈ ప్రాజెక్ట్ మొదలుకానుంది. ఇది కాకుండా రజనీ తన 169వ చిత్రాన్ని కూడా ఎవరితో చేయాలనే విషయమై ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.

తమిళ సినీ వర్గాల సమాచారం మేరకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్లో ఈ సినిమా ఉండొచ్చని తెలుస్తోంది. స్టార్ హీరొలని హ్యండిల్ చేయడంలో గౌతమ్ మీనన్ కు ప్రత్యేక శైలి ఉంటుంది. క్లాస్ సినిమాతోనే హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తారాయన. అది నచ్చే రజనీ ఆయనతో వర్క్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారట. ఈ సినిమాను వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తుందట. అయితే ఈ విషయమై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇకపోతే రజనీ ‘దర్బార్’ 2020 జనవరి 9న విడుదలకానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు