రజనీ ‘దర్బార్’ లేటెస్ట్ అప్డేట్ !

Published on May 14, 2019 4:39 pm IST

‘పేట’ లాంటి ఎనర్జిటిక్ హిట్ తరవాత సూపర్ స్టార్ రజనీకాంత్ మురుగదాస్ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘దర్బార్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ముంబైలో జరుగుతోంది. చిత్ర యూనిట్ సమాచారం మేరకు ఈ షెడ్యూల్ త్వరలోనే ముగియనుందని, తర్వాతి షెడ్యూల్ ఈ నెలాఖరు నుండి మొదలవుతుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో కూడా రజనీ మంచి ఎనర్జిటిక్ పాత్రలోనే కనిపిస్తారట. మురుగదాస్ గత చిత్రం ‘సర్కార్’ మంచి విజయాన్ని సాధించి ఉండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది.

సంబంధిత సమాచారం :

More