ఓటిటి లో కూడా అదరగొడుతున్న రజినీకాంత్ ‘జైలర్’

Published on Sep 9, 2023 7:02 pm IST

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మాస్ యాక్షన్ ఎమోషనల్ ఎంటర్టైనర్ మూవీ జైలర్. తమన్నా, యోగిబాబు, నాగబాబు, వినాయకన్, రమ్యకృష్ణ తదితరులు కీలక పాత్రలు చేసిన జైలర్ ఇటీవల ఆడియన్స్ ముందుకి వచ్చి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ గ్రాండ్ గా నిర్మించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించారు.

అయితే మ్యాటర్ ఏమిటంటే, తాజాగా ప్రముఖ ఓటిటి మాధ్యమం అమెజాన్ ప్రైమ్ ద్వారా బుల్లితెర ఆడియన్స్ ముందుకి వచ్చిన జైలర్ అందరిని ఆకట్టుకుంటూ ప్రస్తుతం దూసుకెళుతోంది. ఇక ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ లో అన్ని భాషల ఆడియన్స్ యొక్క మెప్పుతో టాప్ లో కొనసాగుతోంది జైలర్ మూవీ. ఓవైపు థియేటర్స్ లో మరోవైపు ఓటిటి లో కూడా తమ మూవీ అదరగొడుతూ ఆడియన్స్ మెప్పు అందుకోవడంతో జైలర్ టీమ్ ఆనందం వ్యక్తం చేస్తోంది.

సంబంధిత సమాచారం :