సంక్రాంతి రజినీతో మొదలవుతుందా…?

Published on Nov 11, 2019 10:45 am IST

2020 సంక్రాంతి టాలీవుడ్ కి చాలా ప్రత్యేకం.ఈ ఏడాది సంక్రాంతి కానుకగా టాలీవుడ్ మరియు కోలీవుడ్ టాప్ స్టార్స్ బరిలో దిగుతున్నారు. సూపర్ స్టార్ రజిని దర్బార్, ప్రిన్స్ మహేష్ సరిలేరు నీకెవ్వరూ, అల్లు అర్జున్ అలవైకుంఠపురంలో మరియు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచి వాడవురా చిత్రాలు సంక్రాంతికి విడుదల అవుతున్నాయి. లేటెస్ట్ సమాచారం ప్రకారం సంక్రాంతి సినిమాల సందడి రజిని దర్బార్ మూవీతో మొదలుకానుందట. మిగతా హీరోలకంటే ముందే అనగా జనవరి 10న దర్బార్ విడుదల తేదీగా నిర్ణయించనున్నారని వినికిడి.

ఆతరువాత మహేష్ సరిలేరు నీకెవ్వరూ మూవీ 11న విడుదల కానుందట. మహేష్ వచ్చిన నెక్స్ట్ డే అనగా జనవరి 12న అల్లు అర్జున్ త్రివిక్రమ్ ల అలవైకుంఠపురంలో విడుదల అవుతుందట. వీరందరి తరువాత పండుగరోజున నందమూరి హీరో ఎంత మంచివాడవురా చిత్రం విడుదల కానుందని వినికిడి. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ సంక్రాంతి సినిమాల విడుదల ఈ తేదీలలో ఉండనుందని తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :

More