రజనీ సినిమా పూర్తయ్యేది ఎప్పుడంటే

Published on Jun 12, 2019 8:57 am IST

సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం మురుగదాస్ డైరెక్షన్లో సినిమా చేస్తున్న సంగతి విధితమే. దీనికి ‘దర్బార్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. శరవేగంగా జరుగుతున్న ఈ చిత్ర షూటింగ్ జూలై నాటికి ముగుస్తుందని అందరూ అనుకున్నారు. కానీ షూటింగ్ ఆగష్టు వరకు జరుగుతుందని మురుగదాస్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. అంతేకాదు సినిమా 2020 సంక్రాంతికి విడుదలవుతుందట.

గత చిత్రం ‘పేట’లో కనిపించినట్టే ఈ చిత్రంలో కూడా సూపర్ స్టార్ ఫుల్ ఎనర్జిటిక్ పాత్రలో కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తోంది. సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సమకూరుస్తున్నారు. మరొక నటి నివేత థామస్ సైతం ఈ చిత్రంలో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

సంబంధిత సమాచారం :

More