‘కాలా’ ట్రైలర్ రెడీ అయింది !

Published on May 28, 2018 4:59 pm IST

సూపర్ స్టార్ రజనీకాంత్ గ్యాంగ్ స్టర్ పాత్రలో ముంబైలోని ధారావి బ్యాక్ డ్రాప్లో రూపుదిద్దుకున్న చిత్రం ‘కాలా’. పా.రంజిత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 7వ తేదీన విడుదలకానుంది. భారీ అంచనాల నడుమ విడుదలకానున్న ఈ చిత్రాన్ని పా.రంజిత్ డైరెక్ట్ చేయడం జరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్ ఆకట్టుకోగా ఇప్పుడు ట్రైలర్ ను సిద్ధం చేశారు టీమ్.

ఈరోజు రాత్రి 7 గంటలకు ఈ ట్రైలర్ విడుదలకానుంది. మరి తెలుగు వెర్షన్ ట్రైలర్ ను ఎప్పుడు విడుదలచేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది. U/A సర్టిఫికెట్ పొందిన ఈ చిత్ర నిడివి 2 గంటల 46 నిముషాలుగా ఉంది. వండర్ బార్ ఫిలిమ్స్ పతాకంపై ధనుష్ నిర్మించిన ఈ చిత్రంలో నానా పటేకర్, హ్యూమా ఖురేషిలు పలు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

సంబంధిత సమాచారం :