మరోసారి తన పెద్ద మనసును చాటుకున్న రజనీకాంత్ !

Published on May 30, 2018 1:17 pm IST

తమిళనాడులోని ట్యుటికోరిన్ లో జరిగిన స్టెరిలైట్ నిరసన పోలీస్ కాల్పుల్లో 11మంది మరణించగా అనేక మంది సామాన్యులు తీవ్ర గాయాలపాలైన సంగతి తెలిసందే. ఈ ఉదంతంపై దేశ వ్యాప్తంగా వ్యతిరేకత రాగా తమిళ సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఈ ఘటనను ఖండించారు. తాజాగా ఈరోజు సూపర్ స్టార్ రజనీకాంత్ ట్యుటికోరిన్ ప్రభుత్వాసుపత్రికి వెళ్లి బాధితుల్ని పరామర్శించారు.

కాల్పుల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల ఆర్ధిక సహాయం ప్రకటించిన ఆయన గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి రూ.10,000ల సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడిన రజనీ ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదని, హింసాత్మక ఘటనల్లో సామాన్యులు బాధింపపడకూడదని, స్టెరిలైట్ కర్మాగారాన్ని శాశ్వతంగా మూసివేయాలని అన్నారు.

సంబంధిత సమాచారం :