“రాక్షసుడు-2″కి 100 కోట్ల బడ్జెట్‌ !

Published on Aug 2, 2021 10:50 am IST


భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కబోతున్న “రాక్షసుడు-2″ షూట్ త్వరలోనే మొదలుకాబోతుంది అని మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేస్తూ అధికారికంగా తెలియజేశారు. “రాక్షసుడు″కు సీక్వెల్ గా తెరకెక్కనున్న “రాక్షసుడు 2″కు కూడా రమేష్ వర్మనే దర్శకత్వం వహించనున్నారు. ఇక ఈ సినిమాలో ఒక స్టార్ హీరో నటించబోతున్నాడట. హీరో, ఇతర వివరాలను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు.

కాగా రాక్షసుడు రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, కోనేరు సత్యనారాయణ సీక్వెల్ గురించి కొన్ని ఆసక్తికరమైన వివరాలను వెల్లడించాడు. “రాక్షసుడు 2′ కథ, రాక్షసుడు కథ కంటే చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుందని.. సీక్వెల్ లో ఎక్కువ కమర్షియల్ అంశాలు ఉంటాయని, సినిమా చివరి వరకు ఉత్కంఠభరితంగా ఉంటుంది” అని ఆయన అన్నారు. ఆలాగే “రాక్షసుడు 2 హాలీవుడ్ చిత్రాలతో సమానంగా ఉంటుందట. 100 కోట్ల బడ్జెట్‌ను కేటాయించామని, ఇది పూర్తిగా లండన్‌లో చిత్రీకరించబడుతుంది. సరైన సమయంలో హీరో పేరును ప్రకటిస్తామని’ కోనేరు సత్యనారాయణ తెలిపారు.

సంబంధిత సమాచారం :