20 నిమిషాల పాత్ర కోసం రకుల్ అంత తీసుకుందా ?

Published on Oct 25, 2018 11:46 am IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పారితోషికం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ అవుతుంది. రకుల్ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో శ్రీదేవి పాత్రలో నటిస్తుందని తెలిసిందే. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో కేవలం 20 నిమిషాల పాత్ర కోసం రకుల్ ఏకంగా కోటి రూపాయల పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. శ్రీ దేవి పాత్ర కూడా సినిమా కీలకమైంది కావడంతో మేకర్స్ ఆమె అడిగినంత ఇచ్చారట.

ఇక రకుల్ ఈచిత్రం తోపాటు తెలుగులో నాగచైతన్య తో కలిసి ‘వెంకీ మామ’ అనే చిత్రంలో నటించనుంది. అలాగే ఆమె ప్రస్తుతం తమిళంలో సూర్య సరసన ‘ఎన్ జీకే’ తోపాటు కార్తీ నటిస్తున్న ‘దేవ్’ అనే చిత్రంలో నటిస్తుంది.

సంబంధిత సమాచారం :