బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్న టాలీవుడ్ బ్యూటీ…!

Published on Aug 8, 2019 12:26 pm IST

రకుల్ నటించిన తాజా చిత్రం “మన్మధుడు2” రేపు గ్రాండ్ గా విడుదల కానుంది. కింగ్ నాగార్జునకు జంటగా రకుల్ నటించిన “మన్మధుడు 2” చిత్రాన్ని దర్శకుడు రాహుల్ రవీంద్ర తెరకెక్కించారు. ఈ చిత్ర ప్రమోషన్స్ లో విరివిగా పాల్గొంటున్న రకుల్ “సిగరెట్ కాల్చితే తప్పేంటి” అని కొన్ని బోల్డ్ కామెంట్స్ కూడా చేయడం గమనార్హం. కాగా ఆమె నటించిన హిందీ చిత్రం “దే దే ప్యార్ దే” అక్కడ మంచి విజయాన్ని అందుకొని బాలీవుడ్ 2019 టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. దీనితో అమ్మడు బాలీవుడ్ అవకాశాలు అందిపుచ్చుకుంటుంది.

ఐతే ఆసక్తిరమైన విషయం ఏమిటంటే రకుల్ హిందీలో నటిస్తున్న ఓ చిత్రం కోసం బెల్లీ డాన్స్ నేర్చుకుంటున్నారని సమాచారం. “మార్జావాన్” అనే హిందీ చిత్రంలో నటిస్తున్న రకుల్ ఓ సన్నివేశంలో బెల్లీ డాన్స్ చేయాల్సివుండటంతో ఆ సన్నివేశంలో పర్ఫెక్షన్ కొరకు ఆమె నిపుణుల దగ్గర బెల్లీ డాన్స్ నేర్చుకుంటుందట. ఎదో సన్నివేశం చేశామా, ఐపోయిందా అని కాకుండా పాత్రకొరకు ప్రత్యేకంగా శిక్షణ తీసుకొని మరి చేస్తున్న రకుల్ డెడికేషన్ మెచ్చుకోకుండా ఉండలేం.

సంబంధిత సమాచారం :