నాగ చైతన్యతో జతకట్టనున్న రకుల్ ప్రీత్

rakul-preet-naga-chaitanya
టాలీవుడ్ హీరోయిన్లలో టాప్ ప్లేస్ లో దూసుకుపోతున్న హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. ఇటు తెలుగు అటు తమిళం రెండు భాషల్లోనూ ఆమెకు చేతి నిండా సినిమాలున్నాయి. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సరసన ‘ధృవ’, మహేష్ – మురుగదాస్ ల కొత్త సినిమాల్లో నటిస్తున్న ఈమె త్వరలో స్టార్ హీరో నాగ చైతన్య హీరోగా ప్రారంభంకాబోతున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ దక్కించుకుంది

ఈ సంవత్సరం రకుల్నటించిన ‘నాన్నకు ప్రేమతో, సరైనోడు’ చిత్రాలు బ్లాక్ బస్టర్లుగా నిలవడంతో ఆమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఇకపోతే ఈ చిత్రాన్ని నాగార్జునతో ‘సోగ్గాడే చిన్ని నాయనా’ వంటి బ్లాక్ బస్టర్ తీసిన కళ్యాణ్ కృష్ణ డైరెక్ చేయనున్నాడు. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది. ప్రస్తుతం నాగ చైతన్య ‘ప్రేమమ్, సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రాలతో బిజీగా ఉన్నాడు.