యంగ్ హీరోతో రకుల్ !

Published on Dec 28, 2018 4:00 am IST

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఈ ఏడాది ఒక్క తెలుగు చిత్రానికి కూడా సైన్ చేయలేదు. ఎన్టీఆర్ కథనాయకుడు లో శ్రీదేవి పాత్రలో నటించినా అది అతిధి పాత్రకే పరిమితం అయ్యింది. ప్రస్తుతం ఆమె ఫోకస్ అంతా కోలీవుడ్ , బాలీవుడ్ పైనే వుంది. ఆక్కడ రెండు తమిళ అలాగే రెండు హిందీ సినిమాల్తో బిజీ గా వుంది.

ఇక ఇప్పుడు రకుల్ మళ్ళీ టాలీవుడ్ లో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని సమాచారం. ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి , యంగ్ హీరో నితిన్ తో ఓ సినిమా చేయనున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రంలో రకుల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారట.

త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఫై క్లారిటీ రానుంది. ఇక నితిన్ ప్రస్తుతం వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘భీష్మ’ అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. జనవరిలో ఈ చిత్రం స్టార్ట్ కానుంది.

సంబంధిత సమాచారం :