ఎన్టీఆర్ బయోపిక్ కోసం సిద్ధం కాబోతున్న స్టార్ హీరోయిన్

Published on Aug 8, 2018 3:17 pm IST

దర్శకుడు క్రిష్ నటరత్న ఎన్టీఆర్ జీవితకథను శరవేగంగా తెరకెక్కిస్తున్న విషయం తేలింసిదే. జూలై 5 నుంచి షూటింగ్ మొదలు పెట్టి మొదటి షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రల కోసం ఇప్పటికే విద్యాబాలన్, రానా, సచిన్ కేడెకర్, మోహన్ బాబు, సుమంత్ తదితరులు నటిస్తున్నారు. క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఈ చిత్రంలో అతిలోకసుందరి శ్రీదేవి పాత్రలో నటిస్తుంది. ఈ విషయాన్ని ఈ చిత్ర సహనిర్మాత విష్ణు అధికారికంగా ప్రకటించారు. కాకపొతే ఇంకా డేట్లు కుదరలేదని కుదిరాక త్వరలోనే ఆమె చిత్రబృందంతో పాల్గొంటుందని ఆయన తెలిపారు.

కాగా నందమూరి తారకరామారావుగారితో శ్రీదేవి చాలా చిత్రాల్లో కలిసి నటించారు. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ లో శ్రీదేవి ప్రస్తావన ఉంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. బుర్రా సాయిమాధవ్‌ మాటలు అందిస్తున్న ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సాయి కొర్రపాటి, విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More