డ్రగ్స్ కేసులో గట్టిగా పోరాడుతున్న రకుల్.. రెండోసారి కోర్టుకు

Published on Sep 29, 2020 6:31 pm IST

సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ మరణం కేసులో బాలీవుడ్ డ్రగ్స్ రాకెట్ బయటపడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మొదటి అనుమానితురాలిగా నటి రియా చక్రబర్తిని ఎన్సీబీ ఆర్ట్స్ చేయగా వరుస్తుండగా స్టార్ నటీమణుల పేర్లు బయటికొచ్చాయి. వాటిలోపు టాలీవుడ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడ ఉంది. అయితే రకుల్ మొదటి నుండి వివాదంలో తన పేరు రావాడ్ని గట్టిగా ఆక్షేపిస్తూ వస్తోంది. ఆమె పేరు వెల్లడికాగానే మీడియాలో వస్తున్న కథనాల మీద ఆమె కోర్టుకు వెళ్లి తన విషయంలో అనాధారిత వార్తలు ప్రసారం చేయకుండా నిలువరించాలని ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసింది. కోర్టు కూడ అనాధారిత కథనాలు రాయకూడదని తెలిపింది.

అయినా మీడియాలో కథనాలు ఆగకపోవడంతో రకుల్ మళ్ళీ కోర్టుకు వెళ్ళింది. స్పందించిన కోర్టు రకుల్ పేరును డ్రగ్స్ కేసులో ప్రస్తావిస్తూ మీడియాలో కథనాలు రాకుండా నియంత్రించడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారో అక్టోబర్ 3లోపు నివేదిక ఇవ్వాలని కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, నేషనల్ బ్రాడ్ కాస్టింగ్ అసోసియేషన్లను కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఆ నివేదిక ఆధారంగానే కేసును అక్టోబర్ 16న విచారణ చేస్తామని కూడ తెలిపింది. మొదటి నుండి రకుల్ తాను ఏ తప్పూ చేయలేదని, తనపై వస్తున్న ఆరోపణలు నిజం కాదని నిరూపించుకోవడానికి గట్టిగానే ప్రయత్నిస్తోంది.

సంబంధిత సమాచారం :

More