హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తనకు దేవుడు ఎంతో అందమైన రూపం ఇచ్చారని చెప్పుకొచ్చింది. అసలు రకుల్ ప్రీత్ సింగ్ ఈ కామెంట్స్ ఎందుకు చేసింది అంటే.. ‘గతంలో చాలా వ్యాధులకు చికిత్స లేదు. ప్రస్తుతం అన్ని రోగాలకు చికిత్స దొరుకుతోంది. అలాంటప్పుడు ఎవరైనా అందంగా కనిపించేందుకు కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటే తప్పేం లేదు’ అంటూ రకుల్ చెప్పుకొచ్చారు. అయితే, తనకు ఎప్పుడూ కాస్మోటిక్ సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం ఏర్పడలేదని, దేవుడు తనకు మంచి రూపాన్ని ఇచ్చాడని రకుల్ చెప్పింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ ఆ మధ్య జిమ్‌లో వర్క్‌వుట్ చేస్తోన్న సమయంలో గాయపడిన విషయం తెలిసిందే.
ఐతే, 6 నెలలు గడిచినప్పటికీ ఆ గాయం నుంచి ఇంకా తాను పూర్తిగా కోలుకోలేదని ఆమె మళ్లీ చెప్పుకొచ్చింది. పైగా ఆ గాయం తనకు ఎన్నో విషయాలు నేర్పింది అంటూ ఈ బ్యూటీ చెబుతుంది. అన్నీ మనం అనుకున్నట్లే జరుగుతాయని అనుకున్నా ఒక్కోసారి కొన్ని విషయాల్లో ఆచితూచి అడుగులు వేయడం మంచిది. నిజానికి గాయాన్ని నేను మొదట నిర్లక్ష్యం చేశాను. చికిత్స తీసుకోవాలని నిర్ణయించుకునే సమయానికే దాని తీవ్రత ఎక్కువైంది. గాయం నుంచి కోలుకోవాలంటే చాలా రోజులు పడుతుందని వారం రోజులకు అర్థమైంది. ధైర్యంగా దాన్ని నుంచి కోలుకుంటున్నాను’ అని రకుల్ చెప్పుకొచ్చింది.


