రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ లో మెరువనున్న రకుల్ ?

రామ్ చరణ్ తో స్పెషల్ సాంగ్ లో మెరువనున్న రకుల్ ?

Published on Jun 22, 2018 11:20 PM IST

మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకేక్కుతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 12 వ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారట ఈ చిత్ర దర్శక నిర్మాతలు . ఈ దిశగా ఆమె తో చర్చలు జరుపుతున్నారని సమాచారం .

ఈ చిత్ర థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడయ్యాయి ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ సుమారు 75 కోట్లకి ఈ చిత్ర హక్కులను దక్కించుతుంది బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నా ఈ చిత్రాన్ని డి వి వి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య నిర్మిస్తున్నారు . కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు .

సంబంధిత సమాచారం

తాజా వార్తలు