సిద్దార్థ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్

Published on Jul 24, 2019 5:46 pm IST

విశ్వనటుడు కమల్ హాసన్ యొక్క ‘ఇండియన్ 2’ చిత్రం ఈ ఏడాది ఆగష్టు నెలలో మొదలుకానుంది. ఇది వరకే మొదలైన ఈ సినిమా బడ్జెట్ కారణాల రీత్యా అలస్యమై ఆగష్టు నెలకు వాయిదాపడింది. ఈ చిత్రంలో హీరో సిద్దార్థ్ ఒక కీలక పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈయనకు జోడీగా ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ఎంపిక చేశారు నిర్మాతలు. తమిళ పరిశ్రమపై ఎక్కువగా దృష్టిపెట్టిన ర‌కుల్ ప్రీత్ సింగ్‌ను ఇదొక మంచి అవకాశమనే అనాలి.

రకుల్, సిద్దార్థ్ కలిసి నటించడం ఇదే మొదటిసారి కాబట్టి వీరిద్దరి జోడీ కొత్తగా ఉండి, అలరిస్తుందని కోలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఇది మాత్రమే కాకుండా శివ కార్తికేయన్ చేస్తున్న కొత్త చిత్రంలో సైతం నటిస్తున్న రకుల్ హిందీలో ‘మర్జవాన్’ తెలుగులో ‘మన్మథుడు 2’ చిత్రాల్లో నటిస్తోంది. అన్ని ప్రాజెక్ట్స్ పెద్దవే కావడంతో వాటి విజయాల వలన రకుల్ కెరీర్ మరింతగా ముందుకెళ్లే అవకాశాలున్నాయి.

సంబంధిత సమాచారం :