రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు విచారణకు హాజరవ్వాలి.. కానీ

Published on Sep 24, 2020 11:09 pm IST


బాలీవుడ్ డ్రగ్ రాకెట్ వివాదంలో నటి రియా చక్రబర్తి అరెస్టు కాగా ఆమె కస్టడీని అక్టోబర్ 6 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. రియా తర్వాత బాలీవుడ్ పరిశ్రమలోని సారా అలీఖాన్, శ్రద్దా కపూర్, దీపికా పదుకొనే లాంటి స్టార్ హీరోయిన్ల పేరు బయటికొచ్చాయి. ఈ డ్రగ్ రాకెట్ వేడి టాలీవుడ్ పరిశ్రమను కూడ తాకింది. టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడ ప్రముఖంగా ప్రస్తావనకు వచ్చింది. దీంతో తెలుగు పరిశ్రమ ఉలిక్కిపడింది. కానీ రకుల్ మాత్రం తనపై మీడియాలో అనాధారిత ఆరోపణలు వస్తున్నాయని ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళారు.

ఇక నిన్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్రూరో అధికారులు రకుల్ ప్రీత్ సింగ్ సహా శ్రద్దా కపూర్, సారా అలీఖాన్, దీపికా పదుకొనేలకు విచారణకు హాజరుకావాలని సమన్లు పంపారు. ఆ సమన్ల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ఈరోజు సెప్టెంబర్ 24న ఎన్సీబీ అధికారుల ముందు హాజరుకావాల్సి ఉంది. కానీ నోటీసులు రకుల్ కు చేరడం, నోటీసులు చేరాయని రకుల్ నార్కోటిక్స్ బ్యూరో అధికారులకు ధృవీకరించడంలో ఆలస్యమైంది. ఆమె అడ్రెస్ కనుక్కోవడానికి ఎన్సీబీ అధికారులకు టైమ్ పట్టింది. చివరికి ఈరోజు నోటీసులు తనకు చేరినట్టు కన్ఫర్మ్ చేసి ప్రజెంట్ ఉంటున్న అడ్రెస్ వివరాలను ఇచ్చారట. దీంతో ఆమె రేపు 25న దీపికా పదుకొనేతో కలిసి విచారణకు హాజరుకానున్నారట. ఇక సారా అలీఖాన్, శ్రద్దా కపూర్ 26న విచారణకు హాజరవుతారు.

సంబంధిత సమాచారం :

More