పవన్ కళ్యాణ్ కు జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ ?
Published on Jul 11, 2017 9:26 am IST


ప్రస్తుతం త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న పవన్ కళ్యాణ్ తర్వాత రెండు సినిమాల్ని చేయాల్సి ఉంది. వాటిలో ఒకటి ఆర్టీ నీసన్ తో కాగా మరొకటి సంతోష్ శ్రీనివాస్ ప్రాజెక్ట్. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తి చేసిన సంతోష్ శ్రీనివాస్ పవన్ సరసన హీరోయిన్ ను వెతికే పనిలో ఉన్నారట. సినీ సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తల ప్రకారం రకుల్ ప్రీత్ సింగ్ ను ప్రాజెక్టులోకి తీసుకునే యోచనలో ఉన్నారని తెలుస్తోంది.

అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక ప్రకటనా లేదు. మరి పవన్ కళ్యాణ్ సరసన నటించాలని ఉందని గతంలో పలుసార్లు తన మనసులోని మాటను వ్యక్తపరచిన రకుల్ ను ఈ అవకాశం వరించిందో లేదో తెలియాలంటే ఇంకొన్నాళ్ళు ఆగాల్సిందే. ఇకపోతే రకుల్ ప్రీత్ ప్రస్తుతం మహేష్ బాబుతో ‘స్పైడర్’, బెల్లంకొండ శ్రీనివాస్ తో ‘జయ జానకి నాయక’, కార్తీతో ఒక తమిళ సినిమా చేస్తూ బిజీగా ఉంది.

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook