మహేష్, సుకుమార్ సినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ !

మహేష్, సుకుమార్ సినిమాలో రకుల్ ప్రీత్‌ సింగ్‌ !

Published on Jul 19, 2018 12:28 AM IST

సూపర్ స్టార్ మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల డెహ్రాడూన్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ముగించుకున్న ఈ చిత్రాన్ని నిర్మాతలు దిల్ రాజు, అశ్వినీదత్, పివిపిలు కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 5న ఈ చిత్రం విడుదలకానుంది.

అయితే మహేష్ తన తర్వాతి సినిమాని సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ప్రస్తుతం తెరకెక్కుతున్న మహేష్ 25వ చిత్రం పూర్తవ్వగానే సుకుమార్ సినిమా మొదలు కానుంది. ఐతే సినీవర్గాల సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్‌ సింగ్‌ కథానాయకగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు