మన్మథుడు 2 లో ఆ హీరోయిన్ కన్ ఫర్మ్ !

Published on Feb 26, 2019 11:09 am IST

దేవదాస్’ తరువాత కొంత గ్యాప్ తీసుకున్న అగ్ర హీరో నాగార్జున ‘తన కొత్త చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నాడు. తన కెరీర్ లో ఆల్ టైం ఫేవరేట్ సినిమాల్లో ఒకటైన మన్మథుడు కి సీక్వెల్ లో నటించనున్నారు నాగ్. ‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 అనే టైటిల్ తో తెరకెక్కనున్నఈచిత్రం మార్చి 12న అధికారికంగా లాంచ్ కానుందని సమాచారం. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ యూరప్ లో జరుగనుంది. ఇక ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా నటించనుంది. కాగా నాగ్ తో కలిసి రకుల్ నటిచడం ఇదే మొదటిసారి.

ఈచిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడు. త్వరలోనే మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకం ఫై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :