శ్రీదేవి పాత్రలో నటించనున్న స్టార్ హీరోయిన్ !

Published on Oct 7, 2018 6:31 pm IST

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రధాన పాత్రలో విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా యన్ టి ఆర్ బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిత్రం రెండు భాగాలుగా రానునుంది. దాంట్లో మొదటి భాగం ‘కథానాయకుడు’ అనే టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితాన్ని చూపించనున్నారు.

ఇక ఈచిత్రంలో ఏఎన్నార్ పాత్రలో సుమంత్, సావిత్రి పాత్రలో నిత్య మీనన్ నటిస్తుండగా తాజాగా అందాలనటి శ్రీదేవి పాత్రకు ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ను ఎంపిక చేశారు. క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈచిత్రాన్ని ఎన్బికె ఫిలిమ్స్ , వారాహి ప్రొడక్షన్స్ , విబ్రి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

సంబంధిత సమాచారం :