నాని 24 స్పెషల్ సాంగ్ లో క్రేజీ హీరోయిన్ !

Published on Feb 21, 2019 9:10 am IST

నాని – ‘మనం’ ఫేమ్ విక్రమ్ కుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న కొత్త చిత్రం ఇటీవలే లాంచ్ అయ్యింది. ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ ఈ చిత్రంలో నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో నటిస్తున్నాడు. డిఫ్రెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇక ఈ చిత్రంలో నాని సరసన ఆరుగురు హీరోయిన్లు నటించనున్నారు. అలాగే ఈసినిమాలోని స్పెషల్ సాంగ్ లో క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ,నాని తో కలిసి స్టెప్పులు వేయనుంది.

రకుల్ స్పెషల్ సాంగ్ లో నటించడం ఇదే మొదటిసారి. ఇక రకుల్ కు పెద్దగా ఆఫర్లు లేవు ప్రస్తుతం ఆమె తెలుగులో వెంకీ మామ కు సైన్ చేయగా తమిళంలో శివ కార్తికేయన్ 14 వ చిత్రంలో నటిస్తుంది. అలాగే సూర్య సరసన ఎన్ జి కె చిత్రంలో నటించింది. ఈ సినిమా విడుదలకావాల్సి వుంది.

సంబంధిత సమాచారం :