రామ్ – బోయపాటి సినిమా పై క్రేజీ అప్ డేట్ !

Published on Apr 25, 2022 12:00 pm IST

యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను పుట్టినరోజు నేడు. ఐతే, ప్రస్తుతం బోయపాటి, హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తమ డైరెక్టర్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టీమ్ బర్త్ డే పోస్టర్ ను రిలీజ్ చేసి బోయపాటికి శుభాకాంక్షులు చెప్పింది. అలాగే ఈ సినిమా గురించి ఒక అప్ డేట్ ఏమిటంటే.. బోయపాటి – హీరో రామ్ కలయికలో రాబోతున్న ఈ సినిమా పాన్ ఇండియా సినిమా అట.

ఈ సినిమాను కూడా బోయపాటి పక్కా ఎమోషనల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ గా మలచాలని ప్లాన్ చేస్తున్నాడు. ముఖ్యంగా రామ్ బాడీ లాంగ్వేజ్ కి సరిపడే సరికొత్త స్టోరీతో బోయపాటి ఈ సినిమా కథని ప్లాన్ చేశాడట. ఆల్ రెడీ అఖండ సినిమాతో లేటెస్ట్ గా అదిరిపోయే సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. కాబట్టి .. బోయపాటి చేస్తున్న ఈ సినిమా పై భారీ అంచనాలు ఉంటాయి.

అన్నిటికీ మించి హీరో ఎవరైనా తన సినిమాల్లో మాస్ ఎలిమెంట్స్ ను పక్కాగా ప్లాన్ చేసి హిట్ కొట్టడంలో బోయపాటికి మంచి అనుభవం ఉంది.

సంబంధిత సమాచారం :