ఎన్టీఆర్ షో కు రామ్ చరణ్ గెస్ట్!?

Published on Jul 15, 2021 10:51 pm IST

బుల్లితెర పై ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పటికే బిగ్ బాస్ రియాలిటీ షో కి ఎన్టీఆర్ వ్యాఖ్యాత గా వ్యవహరించి ప్రేక్షకుల ను ఆకట్టుకున్నారు. అయితే ఈ సారి ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమం చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ కార్యక్రమం త్వరలో జెమిని టివి లో ప్రసారం కానుంది.

అయితే ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈ కార్యక్రమం కి మొడటి గెస్ట్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ ఇందుకు సంబంధించిన చిత్రీకరణ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ కార్యక్రమం మొదలు కానున్న సంగతి తెలిసిందే. అయితే ఇందుకోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు హీరోలు గా కలిసి నటిస్తున్న తాజా చిత్రం రౌద్రం రణం రుధిరం. ఈ చిత్రం కి దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం లో జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో, రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన పోస్టర్లు, వీడియోలు ఇప్పటికే సినిమా పై అంచనాలను మరింతగా పెంచేశాయి. తాజాగా విడుదల అయిన మేకింగ్ వీడియో సైతం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 13 న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :