ఒకే ఒక గిఫ్ట్ అడుగుతున్న రామ్ చరణ్

Published on Mar 27, 2020 7:55 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. నిన్ననే ఆయన ట్విట్టర్ అకౌంట్ రీఓపెన్ చేశారు. దీంతో అభిమానులు ఆయనకు నిన్న అర్థరాత్రి నుండే విషెస్ చెబుతున్నారు. ఈ సంధర్భంగా చరణ్ మాట్లాడుతూ మీ అందరి శుభాకాంక్షలకు కృతజ్ఞతలు.. లవ్ యు ఆల్ అంటూనే అందరి నుండి ఒకే ఒక గిఫ్ట్ కోరారు ఆయన.

దేశం మొత్తం కరోనా వైరస్ కర్ఫ్యూ నడుస్తోంది. వైరస్ వ్యాప్తి నివారణలో భాగంగా ప్రజల్ని బయటకి రావొద్దనే ఆంక్షలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని అందరూ ఇళ్లకే పరిమితం కావాలని, లాక్ డౌన్ ముగిసేవరకు బయటికి రావొద్దని, ఇదే ఈ పుట్టినరోజుకు మీరంతా నాకిచ్చే పెద్ద బహుమతి అన్నారు. దానికి అభిమానులు సైతం మీ సూచనను తప్పక పాటిస్తాం అన్నయ్య అంటూ స్పందిస్తున్నారు. ఇకపోతే చరణ్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మోషన్ పోస్టర్ మొన్ననే విడుదలై మంచి స్పందన దక్కించుకుంది.

సంబంధిత సమాచారం :

X
More