బాలీవుడ్ బ్యూటీ హుమా ఖురేషీ లీడ్ రోల్‌లో నటించిన ‘బేబీ డు డై డు’ చిత్రం ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర సందడి చేస్తోంది. ఈ సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌తో చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తోంది. తాజాగా ఈ చిత్రానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నుంచి సాలిడ్ బూస్ట్ దక్కింది.
ఈ సినిమాపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సినిమా గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని, హుమా ఖురేషి మరియు సాకిబ్ సలీమ్ ఈ చిత్రం కోసం తమ సర్వస్వాన్ని ధారపోశారని ట్వీట్ చేస్తూ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపాడు.
బాక్సాఫీస్ వద్ద పెద్దగా బజ్ లేని ఈ చిన్న హిందీ చిత్రాన్ని రామ్ చరణ్ ప్రమోట్ చేయడం నెటిజన్లను ఆశ్చర్యపరిచింది. చరణ్ పోస్ట్‌తో ఈ సినిమాపై ఒక్కసారిగా అందరి దృష్టి పడింది.


