
రామ్ చరణ్ ‘రంగస్థలం’ చిత్రంతో సరికొత్త రికార్డ్ సృష్టించారు. తొలిరోజు ఈ చిత్రం చైన్నైలో రూ.25 లక్షల గ్రాస్ ను వసూలు చేసింది. ‘బాహుబలి’ మినహా ఇంత వరకు ఏ తెలుగు హీరో సినిమాకి ఈ స్థాయి ఓపెనింగ్స్ దక్కలేదు. గతంలో ఈ రికార్డ్ రూ.24 లక్షలతో పవన్ కళ్యాణ్ నటించిన ‘అజ్ఞాతవాసి’ పేరు మీద ఉండేది.
లక్ష రూపాయల మార్జిన్ తో చరణ్ పవన్ రికార్డును బ్రేక్ చేశాడు. వాస్తవికతకు దగ్గరగా ఉండే కథ, పాత్రలు, చరణ్ నటన, సుకుమార్ కథను పల్లెటూరి నైపథ్యంలో చెప్పిన విధానం తమిళ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. పైగా తమిళ ప్రేక్షకులకు సుపరిచితమైన ఆది పినిశెట్టి, సమంతలు నటించి ఉండటం కూడ సినిమాకు కలిసొచ్చింది. ఇక తెలుగు రాష్ట్రాలు, ఓవర్సీస్లో సైతం ఈ చిత్రం భారీగా వసూళ్లను రాబడుతోంది.

