రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సెన్సార్ డీటైల్స్

రామ్ చరణ్ ‘బ్రూస్ లీ’ సెన్సార్ డీటైల్స్

Published on Oct 12, 2015 3:55 PM IST

Bruce-Lee
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఫ్యామిలీ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘బ్రూస్ లీ’. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను పూర్తి చేసుకొని తొలి కాపీని సిద్దం చేసుకున్న ఈ చిత్ర టీం ఈ రోజు ఫైనల్ కాపీని సెన్సార్ ముందుకు పంపింది. మధ్యాహ్నం బ్రూస్ లీ సినిమా చూసిన సెన్సార్ వారు బ్రూస్ లీ సినిమాకి ‘యు/ఏ’ సర్టిఫికేట్ ఇచ్చారు. డైరెక్టర్ శ్రీనువైట్ల ఈ సినిమాకి క్లీన్ యు సర్టిఫికేట్ ని ఆశించినా ఫ్యామిలీ ఎమోషన్స్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఎక్కువగానే ఉండడంతో సెన్సార్ వారు ‘యు/ఏ’ సరిఫికేట్ ఇచ్చారు.

సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తవడంతో ఈ చిత్ర టీం సినిమా ఫైనల్ కాఫీని ఇక ప్రింట్స్ వేసి అన్ని ప్రాంతాలకి పంపడానికి సిద్దమయ్యారు. అంతే కాకుండా సెన్సార్ సర్టిఫికేట్ ని వేస్తూ వచ్చే కొన్ని కామెడీ టీజర్స్ ని మరికొద్ది సేపట్లో రిలీజ్ చేయనున్నారు. రామ్ చరణ్, శ్రీనువైట్ల అండ్ టీం ఈ సినిమా సక్సెస్ పై పూర్తి నమ్మకంతో ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమాలో కనిపించనుండడం ఈ సినిమాకి మరో బిగ్గెస్ట్ హెల్పింగ్ పాయింట్. రామ్ చరణ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో నదియా, కృతి కర్భంద, అరుణ్ విజయ్, రావు రమేష్ లు ముఖ్య పాత్రలు పోషించారు. డివివి దానయ్య నిర్మించిన ఈ సినిమాని దసరా కానుకగా అక్టోబర్ 16న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు.

తాజా వార్తలు