కుటుంభ సభ్యుడిని మిస్సవుతున్నాం – రామ్ చరణ్

Published on Dec 8, 2019 5:52 pm IST

గ్రేటర్ హైదరాబాద్ మెగా ఫ్యాన్స్ ప్రెసిడెంట్ నూర్ మహమ్మద్ ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. నూర్ మహమ్మద్ మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు కావడంతో మెగా హీరోలంతా తమ బాధను వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్ ఈరోజు తన సినిమా ‘అల వైకుంఠపురము’లో మూవీ అప్డేట్ వాయిదా వేసుకున్నారు. ఇక నూర్ బాయ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే రామ్ చరణ్ అయితే ‘అభిమానులే మా కుటుంబం. మా కుటుంబ సభ్యుడు నూర్ మహమ్మద్ జీని మిస్సవుతున్నాం. ఆయన పాజిటివిటీ, హెల్పింగ్ నేచర్ యువతకు ఆదర్శం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి’ అంటూ ప్రార్థించారు.

మరొక మెగా హీరో సాయి తేజ్ మెగా అభిమానుల కుటుంబానికి ఒక బలమైన స్తంభం కూలింది. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నాను అన్నారు. అలాగే ఇతర మెగా హీరోలు సైతం తమ సంతాపాన్ని తెలిపారు. ఇక మెగా అభిమానులైతే తమ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది అంటూ తీవ్ర ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More