చిరు 150వ సినిమా డీటైల్స్ చెప్పిన రామ్ చరణ్

చిరు 150వ సినిమా డీటైల్స్ చెప్పిన రామ్ చరణ్

Published on Dec 14, 2015 9:46 AM IST

Chiranjeevi-ram-charan

గత కొద్ది నెలలుగా అందని ద్రాక్ష పళ్ళలా మెగా అభిమానులును ఊరిస్తున్న విషయం మెగాస్టార్ చిరంజీవి నటించబోయే 150వ సినిమా. చాలా రోజుల నుంచి ఈ 150వ సినిమా వార్తల్లోనే ఉంది కానీ ఇప్పటి వరకూ ఎలాంటి కచ్చితమైన వార్తా లేదు. దసరా కానుకగా చిరు 150వ సినిమా అనౌన్స్ చేస్తా అన్నారు కానీ అనౌన్స్ చేయలేదు. దాంతో చిరు 150వ సినిమా గత కొద్ది రోజులుగా న్యూస్ లో చక్కర్లు కొడుతోంది. ఎట్టకేలకు రామ్ చరణ్ నిన్న సాయంత్రం చిరు 150వ సినిమాని మీడియా ద్వారా అనౌన్స్ చేసారు.

గత రాత్రి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బెంగళూరులో జరిగిన రిట్జ్ ఐకాన్ అవార్డ్స్ 2015 వేడుకకి హాజరయ్యాడు. అక్కడ ఓ మీడియా ప్రతినిధి చిరు 150వ సినిమా గురించి అడగగా ‘చిరు 150వ సినిమా కథని ఫిక్స్ చేసేసాం. తమిళ బ్లాక్ బస్టర్ కత్తి రీమేక్ లో నటించనున్నారు. వివి వినాయక్ దర్శకత్వం వహించబోయే ఈ సినిమాని నేనే నిర్మిస్తాను’ అని చరణ్ తెలిపాడు. ఈ సినిమా అధికారిక ప్రకటన రావడంతో మెగా అభిమానుల్లో ఎక్కడ లేని ఆనందం నెలకొనడమే కాకుండా సోషల్ మీడియాలో ట్రెండ్ సెట్ చేస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు