అవార్డును అభిమానికి అంకితం చేసిన రామ్ చరణ్.

Published on Dec 11, 2019 12:26 am IST

హీరో రామ్ చరణ్ అభిమానుల పట్ల తన కుండే ప్రేమ, గౌరవాన్ని తన చర్యల ద్వారా చాటుకుంటున్నాడు. ఇటీవల మరణించిన మెగా ఫ్యామిలీ అభిమాని నూర్ అహ్మద్ కుటుంబానికి పది లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన రామ్ చరణ్, నేడు ఓ ప్రముఖ వేదిక సాక్షిగా ఆ అభిమానిని గుర్తు చేసుకోవడమే కాకుండా తనకు వచ్చిన అవార్డుని అతనికి అంకితమిచ్చారు. బిహైన్డ్స్ ది వుడ్స్ గోల్డ్ మెడల్ అవార్డ్స్ లో భాగంగా తెలుగు నుండి రామ్ చరణ్ పీపుల్స్ ఎంటర్టైనర్ ఎక్స్ లెన్స్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డ్ ని అందుకున్న రామ్ చరణ్ హఠాత్ మరణం చెందిన నూర్ అహ్మద్ కి అంకితం ఇచ్చారు.

ఇక ప్రస్తుతం రామ్ చరణ్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ ఆర్ ఆర్ మూవీలో నటిస్తున్నారు. రామ్ చరణ్ ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుండగా మరో హీరో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్ర తాజా షెడ్యూల్ విశాఖ ఏజెన్సీ లో మొదలైంది. ఎన్టీఆర్ పై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారని సమాచారం. డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా వచ్చే ఏడాది జులై 30న విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More