హాలీవుడ్ వెబ్‌సిరీస్‌తో డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్న రామ్ చరణ్?

Published on Feb 16, 2022 2:00 am IST

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే చరణ్ నటించిన భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం “ఆర్ఆర్ఆర్” విడుదలకు సిద్ధమవుతుండగా.. డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న పొలిటికల్ థ్రిల్లర్ సెట్స్ మీదకు వెళ్ళింది. దీని తర్వాత గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ రెండింటి తర్వాత చరణ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఓ హాలీవుడ్ వెబ్ సిరీస్‌ను రీమేక్ చేస్తుందట. అమెరికాకు చెందిన ఓ పాపులర్ వెబ్ సిరీస్‌ని భారతీయ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీనిపై చరణ్‌తో సంప్రదింపులు కూడా జరిపారట. ఈ సిరీస్ కోసం బాలీవుడ్ డైరెక్టర్‌ని తీసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. అయితే ఈ సిరీస్‌కి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వేచి చూడాల్సిందే.

సంబంధిత సమాచారం :