ప్రస్తుతం మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ స్పోర్ట్స్ డ్రామా “పెద్ది” కోసం అందరికీ తెలిసిందే. ఈ సినిమా మార్చ్ లోనే విడుదల కావాల్సి ఉంది కానీ దానిని ఇంకో నెల వెనక్కి జరిపారు. అయితే ఈ కొత్త డేట్ కి సమయం దగ్గరకి వస్తుంది కానీ మేకర్స్ నుంచి మాత్రం ఎలాంటి ఉలుకు లేదు.
చాప కింద నీరు లానే అసలు ఈ నెల రిలీజ్ ఉంది అనేట్టు హంగామా లేకుండా స్మూత్ గా వాయిదా అని చెప్పకనే చెప్పేసారు. దీనితో పాటుగా పెద్ది వాయిదాపై క్లారిటీ లేని ఫ్యాన్స్ ని కూడా రామ్ చరణ్ తనదైన కొత్త స్టైలింగ్ మరియు లుక్స్ తో డైవర్ట్ చేసాడని కూడా చెప్పొచ్చు. ఓ మ్యాగజైన్ కోసం చరణ్ చేసిన స్టైలింగ్ పెద్ది వాయిదాని మర్చిపోయేలా చేశాయని చెప్పొచ్చు. ఇక ఇవి పక్కన పెడితే కొత్త డేట్ ఎప్పుడు అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి దీనిపై మేకర్స్ ఏమన్నా క్లారిటీ ఇస్తారో లేదో చూడాలి.


