పవన్ కల్యాణ్‌గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను – చరణ్

Published on Mar 26, 2020 11:06 am IST

కరోనా వైరస్ మొత్తం ప్రపంచంలో ఒక రకమైన భయానిక వాతావరణాన్ని సృష్టించింది. కరోనా మహమ్మారి ప్రమాదకరంగా విస్తరిస్తున్న నేపథ్యంలో సామాన్యులను ఆదుకునేందుకు రామ్ చ‌ర‌ణ్ క‌రోనా నిర్మూలనా చర్యలకు రూ.70 ల‌క్షలు విరాళం ఇచ్చిన సంగతి తెలిసిందే. ‘‘పవన్ కల్యాణ్‌గారి ట్వీట్ చూసి స్ఫూర్తి పొందాను. కరోనా నివారణ కోసం కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు రూ.70 లక్షల రూపాయలను అందిస్తున్నాను. అందరు బాధ్య‌త గ‌ల పౌరుడిగా ప్ర‌భుత్వాలు సూచించిన నియ‌మాల‌ను పాటించాల‌ని కోరుతున్నాను’’ అని ట్విట్టర్‌లో రామ్‌చ‌ర‌ణ్‌ పోస్ట్ చేశారు.

ప్రభుత్వాలతో పాటు సినీ ప్రముఖులు కూడా కరోనా పట్ల ప్రజలను మరింత అప్రమత్తం చేయడంతో పాటు సహాయ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టడం హర్షించతగ్గ విషయం. అయితే ఇంకా ఎంతమంది తారలు దేశం కోసం తమ వంతు కృషి చేయడానికి ముందుకు వస్తారో చూడాలి. ఇక కరోనా వైరస్ టాలీవుడ్ పరిశ్రమను టెంక్షన్లో పడేసింది. ఈ వైరస్ కారణంగా షూటింగ్ జరుపుకోవాల్సిన పలు సినిమాలు షెడ్యూల్స్ వాయిదా వేసుకున్నాయి.

సంబంధిత సమాచారం :

X
More